కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం!
కాకినాడ కలెక్టరేట్ వద్ద కుప్పకూలిన భారీ వృక్షం
గ్రీవెన్స్ విభాగం సమీపంలో ఘటన
రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. తొలగింపు చర్యలు
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
కాకినాడ:
కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గ్రీవెన్స్ విభాగం వద్ద భారీ వృక్షం కుప్పకూలింది. విషయం తెలియగానే ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.
కుప్పకూలిన వృక్షాన్ని భాగాలుగా తొలగిస్తూ పరిసరాలను సురక్షితంగా మార్చే పనులు చేపట్టారు. భారీ వృక్షం నేలకొరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి.
వర్షాల నేపథ్యంలో కాకినాడలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్న సమయంలో కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో సిబ్బంది వెంటనే స్పందించి తొలగింపు పనులు చేపట్టారు.