BREAKING
సమ్మిళిత అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం మరియు బహుపాక్షిక సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉంది: ఐరాసలో సిబి జార్జ్ స్పష్టీకరణ సిరిసిల్లకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కాకినాడ ను ముంచెత్తిన వర్షం హిందూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి ఏఐ రంగంలో చైనా స్టార్టప్ సంచలనం! మత్తడి దుంకిన గోలపు లోద్ది చెరువు కేవలం 4 నిమిషాల్లో ఈవీ ఛార్జింగ్ అమెరికాతో పోరులో చైనా రహస్య సహాయమే ఇరాన్‌కు బలం: వెలుగులోకి వస్తున్న వ్యూహాత్మక ఒప్పందాలు అనంతపురం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పాఠశాలల వద్ద జంక్ ఫుడ్‌పై కఠిన ఆంక్షలు ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. ప్రజాసేవే లక్ష్యం దేశంలోనే పదో అత్యంత విలువైన సంస్థగా ఎన్‌ఎస్ఈ: రూ. 4.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ క్యాప్ సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ ట్రాన్స్ జెండర్లు మామూళ్ల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ కౌలుట్లయ్య రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికైన రాంరెడ్డికి సన్మానం

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ!

Select Suryaa Now
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ!

సూర్య జాతీయ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించనున్నట్లు పిఎంవో ప్రకటించింది. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని తెలిపారు.

గురువారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న స్లీపర్ బస్సు గ్రేటర్ నోయిడాలోని జేవార్ పోలీస్ స్టేషన్ పరిధి, 33వ మైలురాయి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. "ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు వైద్య సదుపాయాలు తక్షణమే అందించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.