హిందూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి
వికారాబాద్ సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మాయ బ్రహ్మ నర్సింహా
వికారాబాద్,మేజర్ న్యూస్(సెప్టెంబర్ 24):
హిందూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వికారాబాద్ సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మాయ బ్రహ్మ నర్సింహా సూచించారు. వికారాబాద్ పట్టణంలోని మాతా బాల భక్త సమాజం ఆధ్వర్యంలో మైసమ్మ గుడి, గణేష్ కట్ట వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాయ బ్రహ్మ నర్సింహా మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పిల్లల్లో మంచి సంస్కారం, విలువలను పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందన్నారు. పిల్లలు తల్లిదండ్రులను, గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు టి. సదానంద్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ టి. శ్రీదేవి, కాలనీవాసులు జగన్నాథ్ రెడ్డి, సామ నర్సింహులు, బాలరాజ్, మోనిగారి పండరినాథ్, డాక్టర్ ఉజ్జ్వల్ తదితరులు పాల్గొన్నారు.