జర్నలిస్ట్ రమేష్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి, ప్రభుత్వ విప్.
సూర్య సుల్తానాబాద్
సుల్తానాబాద్ సిటీ కేబుల్, టివి9 రిపోర్టర్ గా పనిచేస్తూ బుధవారం గుండెపోటుతో మరణించిన రమేష్ మృతదేహానికి గురువారం పూల మాల వేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ లు నివాళులు అర్పించారు. రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రిపోర్టర్ గా రమేష్ గడిచిన 20 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రమేష్ మరణం తీరని లోటు అని అన్నారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని మంత్రి లక్ష్మణ్ కుటుంబ సభ్యులను కోరారు.