మాడ్గులలో ఘనంగా cm సతీమణి జన్మదిన వేడుకలు
మాడ్గులలో ఘనంగా cm సతీమణి జన్మదిన వేడుకలు
మాడ్గుల్, మేజర్న్యూస్ (సెప్టెంబర్ 24) : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీమణి, అభ్యధయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూధిని పద్మారెడ్డి కుమార్తే ఎనుముల గీతమ్మ జన్మదిన వేడుకలను గురువారం మాడ్గుల మండల కేంద్రంలో రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు, డిసిసి ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జింకల భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముదెంటి రజిత దేవయ్యగౌడ్, డిసిసి కార్యదర్శి కాట్ల యాదయ్యగౌడ్, రేవంత్ మిత్రమండలి, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతి కార్యాలయం ఎదుట రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు జింకల భాస్కర్ ఆధ్వర్యంలో గీతమ్మ చిత్రపటాన్ని ఉంచి జన్మదిన కేక్ కట్ చేసి ప్రజలు, పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ మిత్రమండలి మండల అధ్యక్షులు హుస్సేన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సూధిని అభిమానులు పాల్గొన్నారు.
---
సోర్స్
రాచాలపల్లి నరసింహ
--------------------