సిరిసిల్లకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
సిరిసిల్లకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువుతో పాటు ఆధునిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ₹200 కోట్లతో సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 30న జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆధునిక సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్లు, ఆటల సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. సిరిసిల్లకు ఈ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.