BREAKING
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ! యాలాల శివసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వృథాగా పోతున్న నీరు వుషులో రజతం సాధించిన నౌరెమ్ రోషిబినా దేవి గ్రూప్ టాప్‌గా సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత పురుషుల కబడ్డీ జట్టు! పొంగుతున్న వాగు... తీరని వంతెన కష్టం! చైనా అనుసంధాన వాహనాలపై నిషేధానికి అమెరికా ముమ్మర చర్యలు: కాంగ్రెస్ బిల్లుకు పెరుగుతున్న మద్దతు నేపాల్‌లో వీసా నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం: 88 మంది చైనా పౌరుల బహిష్కరణ.. మరో 329 మందిపై విచారణ కెన్యాలో టాటా కెమికల్స్‌కు ఎదురుదెబ్బ: మగాడీలో కార్యకలాపాలు నిలిపివేసి వెళ్లిపోవాలన్న అధ్యక్షుడు రూటో గణేష్ నిమజ్జన వేడుకల్లో విద్యుత్ షాక్ తో యువకుని మృతి క్రిస్పర్ తరహా విప్లవాత్మక ఎంజైమ్ వ్యవస్థను కనుగొన్న క్లాడ్ ఏఐ మోడల్: ఆంత్రోపిక్ సంచలన ప్రకటన మడకలవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పో బలప్రయోగం లేని సంభాషణలకు సిద్ధం: యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన ఆస్ట్రేలియా మెడికేర్ పోర్టల్‌లోకి చొరబడిన ఓపెన్ఏఐ ఏజెంట్: ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడి కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం! వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి

వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి

Select Suryaa Now
వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి

వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి
రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో 11వ రోజు ప్రత్యేక దర్శనం
 

పటాన్‌చెరు: రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు సిద్ధి గణపతి స్వామివారు వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించబడి భక్తులకు విశేష దర్శనం ఇచ్చారు.
రంగురంగుల పుష్పాలు, పుష్పమాలలు, ఆకులు, ప్రత్యేక అలంకరణలతో స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పుష్పాలంకరణలో కొలువుదీరిన సిద్ధి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుండగా, వివిధ అలంకరణల్లో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు