భారీ వర్షం...రెండు గ్రామాలకు రాకపోకలు బంద్
సూర్య జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని ఎండపల్లి మండలంలోని కొండాపూర్‌కు వెళ్లే మార్గంలో చిన్న వంతెనపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదాలు జరగకుండా ఎండపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపి ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే ప్రజలకు రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నారు.
అత్యవసర వేళ అనారోగ్యులను ఆసుపత్రికి తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.