చలో సిరిసిల్ల గడ్డ.. కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం!
30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి..
సూర్య కరీంనగర్ ప్రతినిధి :
సెప్టెంబర్ 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చలో సిరిసిల్ల గడ్డ.. కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం” అనే నినాదంతో కరీంనగర్ నుంచి భారీగా తరలిరావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే ఈ బహిరంగ సభను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సిరిసిల్ల గడ్డపై నిర్వహించనున్న సభకు కరీంనగర్ జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఉత్సాహాన్ని చాటాలని నరసన్న కోరారు. సెప్టెంబర్ 30న కరీంనగర్ నుంచి సిరిసిల్లకు భారీగా తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.“సిరిసిల్ల గడ్డకు చలో.. భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం” అని ఆకుల నరసన్న పటేల్ పిలుపునిచ్చారు.