ఈనెల 30న సిరిసిల్లలో లక్ష మందితో సీఎం రేవంత్ రెడ్డి సభ
--రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సూర్య రుద్రంగి :
సెప్టెంబర్ 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహిస్తున్నామని ప్రజలు విజయవంతం
చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలో సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్‌లో ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.