నున్న–వికాస్ కాలేజీ రోడ్డులో రాకపోకలు నిలిపివేత
విజయవాడ, సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్ : నున్న గ్రామ శివారులో పోలవరం కాలువ దాటిన తర్వాత వికాస్ కాలేజీకి వెళ్లే రోడ్డుపై పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగించకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసివేసినట్లు సింగ్‌నగర్ ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ తెలిపారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా నున్న గ్రామ ప్రజలు ఎవరూ పోలవరం కాలువ–వికాస్ కాలేజీ రోడ్డు వైపు వెళ్లవద్దని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.