BREAKING
బీర్భూమ్ రాతి క్వారీల పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై ఎన్ఐఏ కొరడా: అనుమతులకు మించి సేకరణపై దర్యాప్తు ముమ్మరం ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం ఈసీఐ అంతర్గత విభేదాల రగడ: ఎన్నికల సంఘం నిర్ణయాల సమీక్ష, ఎస్ఐఆర్ నిలిపివేతకు కాంగ్రెస్ డిమాండ్ బింజ్ వాచింగ్ సంస్కృతిలో భాగం కావాలనుకున్నా: 'షక్' వెబ్ సిరీస్‌పై పరిణీతి చోప్రా అక్టోబర్‌ 1లోపు గ్యాస్‌ వినియోగదారులు ఆధార్‌ ధృవీకరణ పూర్తి చేయాలి ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య: నిజాన్ని నిగ్గుతేల్చేలా సమగ్ర దర్యాప్తు జరపాలని ఏబీవీపీ డిమాండ్ భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం, మౌలిక వసతులపై సాయుధ గ్రూపుల మెరుపు దాడులు: తీవ్రస్థాయికి చేరిన ఘర్షణలు విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం కాటలోనియాలో కుడిపక్ష తీవ్రవాదం కలకలం

భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ప్రొద్దుటూరులో వర్షాలు, భారీ వర్షాలు పడవచ్చని  సూచనలు ఉన్నందుకు వలన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు అందరూ   ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. దయచేసి ఈ క్రింది సూచనలు పాటించాలి అని కోరారు.

1. అవసరం అయితేనే బైటకు రావాలి 

2. గృహానికి కావల్సిన నిత్యవసరం సరుకులు ముందుగానే సమాకుర్చుకోండి 

3. పిల్లలు, వృద్దులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు బైటకు రావద్దు 

4. ఎలక్ట్రికల్ వైర్లను, కరెంటు స్థంబాలను తాకవద్దు

5. కాచి చల్లార్చిన నీరు త్రాగవలెను. సందర్భన్ని బట్టి విద్యుత్ సప్లై లో అంతరాయము ఉండవచ్చు త్రాగునీరు స్టాక్ ఉంచుకోవలెను 

6. సెల్ ఫోన్ చార్జీలు ఉంచుకోవాలి, పవర్ బ్యాక్ అప్ పెట్టుకోండి.

7. ఎక్సపెక్టెడ్ డేట్ డెలివరీ ఉన్న మహిళలు తప్పనిసరిగా వైద్య సహాయం ముందుగానే పొందవలెను.

8. భారీ వృక్షాలు క్రింద ఉండవద్దు

9. ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుంది. సమస్యలు ఉంటే దగ్గిరలో ఉన్న వార్డు సచివాలయానికి సమాచారం అందించండి.

10. అధికారులు అందరు విధులలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

11. డ్రైన్స్ నిండిన, రోడ్డులపై నీరు నిల్వ ఉన్న కమీషనర్ కీ, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇవ్వండి.

12. మా పారిశుధ్య కార్మికులు, మున్సిపాలిటీ సిబ్బంది 24 x 7  ప్రజాప్రయోజనార్ధం అందుబాటులో ఉంటారు

13. మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. సమస్య ఉంటే 9849906669 సెల్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు.

14. ఇప్పటికే వాటర్ వర్క్స్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశాను.

15. స్థానిక శాసనసభ్యులు శ్రీయుత వరదరాజుల రెడ్డి గారు సూచనలతో ప్రొద్దుటూరు ప్రజలకు వర్షభావం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ ద్వారా సహాయం అందించడం జరుగుతుంది. 

16. దయచేసి మాకు సహకారం అందించమని విజ్ఞప్తి చేశారు.