BREAKING
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసులు దాడులు 40 వార్డులకు సంబందించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితా బీర్భూమ్ రాతి క్వారీల పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై ఎన్ఐఏ కొరడా: అనుమతులకు మించి సేకరణపై దర్యాప్తు ముమ్మరం ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం ఈసీఐ అంతర్గత విభేదాల రగడ: ఎన్నికల సంఘం నిర్ణయాల సమీక్ష, ఎస్ఐఆర్ నిలిపివేతకు కాంగ్రెస్ డిమాండ్ బింజ్ వాచింగ్ సంస్కృతిలో భాగం కావాలనుకున్నా: 'షక్' వెబ్ సిరీస్‌పై పరిణీతి చోప్రా అక్టోబర్‌ 1లోపు గ్యాస్‌ వినియోగదారులు ఆధార్‌ ధృవీకరణ పూర్తి చేయాలి ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య: నిజాన్ని నిగ్గుతేల్చేలా సమగ్ర దర్యాప్తు జరపాలని ఏబీవీపీ డిమాండ్ భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం, మౌలిక వసతులపై సాయుధ గ్రూపుల మెరుపు దాడులు: తీవ్రస్థాయికి చేరిన ఘర్షణలు

ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం

Select Suryaa Now
ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం

ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం

11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు.

సంగారెడ్డి: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 11వ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం’ అనే ప్రధాన సందేశంతో ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యాధులను నివారించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే, ముందస్తు ఆరోగ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.ఆయుర్వేదం, యోగా ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంచి వ్యాధి నుంచి సంపూర్ణ ఆరోగ్యం వైపు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆయుర్వేదం కేవలం వ్యాధులకు చికిత్స అందించే విధానం మాత్రమే కాదని, ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, శారీరక–మానసిక ఆరోగ్యం, శరీరం–మనస్సు మధ్య సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే సమగ్ర వైద్య విధానమని వివరించారు.

ఆయుష్‌ వైద్య సేవల బలోపేతం

తెలంగాణలో ఆయుష్‌ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో సుమారు 700 మంది యోగా శిక్షకులను నియమించి ప్రజలకు యోగా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.ఆయుర్వేదం, హోమియోపతి, యునాని విభాగాల్లో 139 మంది సహాయ ఆచార్యులను నియమించి ఆయుష్‌ వైద్య విద్య, బోధనా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు మంత్రి వెల్లడించారు.

మూడు జిల్లాల్లో 50 పడకల ఆసుపత్రులు

ప్రజలకు మెరుగైన ఆయుష్‌ వైద్య సేవలు అందించేందుకు సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల సమగ్ర ఆయుష్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

కరీంనగర్‌లో రూ.15 కోట్ల వ్యయంతో 50 పడకల సమగ్ర ఆయుష్‌ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ఆయుష్‌ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలను దశలవారీగా అభివృద్ధి చేస్తూ మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

విద్యార్థులు, వైద్యుల సంక్షేమానికి ప్రాధాన్యం

ఆయుష్‌ విద్యార్థులు, వైద్యుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైద్య శిక్షణలో ఉన్న విద్యార్థుల నెలవారీ భత్యాలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.ఇటీవల గృహ వైద్య శిక్షణలో ఉన్న వైద్యుల నెలవారీ భత్యాన్ని రూ.13,754 నుంచి రూ.29,792కు, ఉన్నత వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల భత్యాన్ని రూ.34,385 నుంచి రూ.74,482కు పెంచినట్లు తెలిపారు. ఆయుష్‌ విద్యార్థులు భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.

సంప్రదాయ వైద్య విజ్ఞానంపై పరిశోధనలు అవసరం

మన సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధనలు, శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఆయుష్‌ విద్యార్థులు చదువుతోనే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కూడా అడుగులు వేయాలని సూచించారు.కొత్త చికిత్సా విధానాలు, ఔషధాలపై పరిశోధనలు చేసి ఆయుష్‌ వైద్య విధానాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. సంప్రదాయ వైద్య విజ్ఞానంలోని బలాన్ని ఆధునిక పరిశోధనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత యువ వైద్యులపై ఉందన్నారు.

అనుమతులు లేకుండా వైద్యం చేస్తే చర్యలు

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆయుష్‌ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆయుష్‌ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అర్హతలు, అనుమతులు లేకుండా ఆయుష్‌ పేరుతో వైద్య సేవలు అందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో ఆయుష్‌ వైద్య విధానాలపై మరింత నమ్మకం, ఆదరణ పెరిగేలా వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.