BREAKING
బుధవారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు: క్రూడ్ ధరల పతనం, మెటల్ షేర్లలో జోరు మందగించిన డిమాండ్.. పత్తి గింజల నూనె ఫ్యూచర్స్ ధరల్లో క్షీణత: క్వింటాలుకు తగ్గిన ధర ఆసీస్‌తో రెండో వన్డే.. టీమిండియా 'ఏ' కెప్టెన్ యస్తికా భాటియా విధ్వంసకర శతకం రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ ఖైరతాబాద్‌ గణేశుడి తుది దర్శనం నేడే: వైభవంగా నిమజ్జన ఏర్పాట్లు పిఠాపురంలో జనసేన నేతల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం: "మీ ఆధిపత్య పోరు ఏంటి?" అంటూ నిలదీత ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌.. కానీ హర్ముజ్‌ విషయంలో మరో ట్విస్ట్‌! గణనాథుడి లడ్డూకు రికార్డు ధర.. రూ.6.11 లక్షలకు వేలం కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసులు దాడులు 40 వార్డులకు సంబందించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితా బీర్భూమ్ రాతి క్వారీల పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై ఎన్ఐఏ కొరడా: అనుమతులకు మించి సేకరణపై దర్యాప్తు ముమ్మరం ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం ఈసీఐ అంతర్గత విభేదాల రగడ: ఎన్నికల సంఘం నిర్ణయాల సమీక్ష, ఎస్ఐఆర్ నిలిపివేతకు కాంగ్రెస్ డిమాండ్ బింజ్ వాచింగ్ సంస్కృతిలో భాగం కావాలనుకున్నా: 'షక్' వెబ్ సిరీస్‌పై పరిణీతి చోప్రా

ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌.. కానీ హర్ముజ్‌ విషయంలో మరో ట్విస్ట్‌!

Select Suryaa Now
ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌.. కానీ హర్ముజ్‌ విషయంలో మరో ట్విస్ట్‌!

సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా–ఇరాన్‌ మధ్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా ఇరు దేశాల ప్రతినిధీల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి మధ్య సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగినట్లు ఇరు వర్గాలు ధ్రువీకరించాయి.

ఈ సమావేశంలో ప్రధానంగా ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాలలో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశం చర్చకు వచ్చింది. యుద్ధం కారణంగా ఇక్కడ రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే ఈ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌ అమెరికా ముందు మూడు ప్రధాన షరతులు పెట్టినట్లు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని, అమెరికా వద్ద స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని, అలాగే ఇరాన్‌ మద్దతు ఉన్న వివిధ రెసిస్టెన్స్‌ ఫ్రంట్లపై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఆ షరతుల్లో పేర్కొన్నాయి.

మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని, ఇరాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో ఇరాన్‌ విషయంలో తన ముందు ఒప్పందం చేసుకుని భవిష్యత్తు మార్చుకోవడం లేదా తీవ్ర సైనిక చర్య అనే రెండు మార్గాలున్నాయని ఆయన హెచ్చరించారు.మూడు గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ ఇరాన్‌–అమెరికా మధ్య ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని, హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం మరియు యుద్ధ ముగింపు మార్గాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.