గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రత
సూర్య జగిత్యాల ప్రతినిధి: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా సుమారు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.