గురువులపై వైసీపీ పార్టీ దాదాగిరీ
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్:
డిఎస్సీ ద్వారా ఎన్నికైన టీచర్స్ మీద వైసిపి పార్టీ నాయకులు దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్ ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గొడ్డలి పార్టీ వారు చేస్తున్న తప్పుడు ఆరోపణను తప్పుడు కథనాలను వ్యతిరేకంగా విజయవాడ షాప్ కార్యాలయం దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తుంటే అక్కడికి వచ్చిన వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు విజయవాడ చుట్టుపక్క ఉన్న రౌడీషీటర్స్, వైసీపీ చిల్లర బ్యాచ్ కలిసి ముకుమ్మడిగా టీచర్స్ మీద దాడి చేయడం చాలా దుర్మార్గం అన్నారు. వైిసిపి చిల్లర బ్యాచ్ టీచర్స్ మీద కోడిగుడ్లు వాటర్ బాటిల్స్ కర్రలతోటి రాడ్లతోటి దాడి చేసి నానా బూతులు తిట్టడం పిరిక చర్యఅని తమ ప్రభుత్వం వస్తే డీఎస్సీ పోస్టులను తీసేస్తామని బెదిరించడం చాలా దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని అభివృద్ధిని అడ్డుకోవాలని.. వైసీపీ చిల్లర బ్యాచ్ చేస్తున్న దుర్మార్గమైన పనులను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రాబోవు స్థానిక ఎలక్షన్లో వైసిపి పార్టీకి వారి ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంకరాపురం చంద్రమోహన్ రెడ్డి.. జనసేన పార్టీ నాయకులు కందుల బాలసుబ్రమణ్యం.. ఎస్సీ నాయకుడు లింగాపురం బాలయ్య పాల్గొన్నారు.