భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రజలు అత్యవసర సమాచారం కోసం 08672-252399 నంబర్‌కు ఫోన్ చేయాలి
మచిలీపట్నం, సెప్టెంబరు 23, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన/డిప్రెషన్ ప్రభావంతో కృష్ణా జిల్లాతో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ డి.కె. బాలాజీ, ఐ.ఏ.ఎస్. తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) నేషనల్ బులెటిన్ నం.3 ప్రకారం, పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన డిప్రెషన్ గత ఆరు గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 2026 సెప్టెంబరు 22వ తేదీ ఉదయం 5.30 గంటలకు 17.9°N అక్షాంశం, 86.3°E రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.
ఈ డిప్రెషన్ తదుపరి 12 గంటల్లో డీప్ డిప్రెషన్‌గా బలపడే అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ విశాఖపట్నం–గోపాలపురం మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాన్ని సెప్టెంబరు 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య డీప్ డిప్రెషన్‌గా దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబరు 22 నుంచి 25వ తేదీ వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 08672-252399
భారీ వర్షాల పరిస్థితికి సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారం, అత్యవసర పరిస్థితులను స్వీకరించి సంబంధిత అధికారులకు తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది.
ప్రజలు భారీ వర్షాలు, నీటి నిల్వలు, వరద పరిస్థితులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని 08672-252399 నంబర్‌కు తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించే సిబ్బంది
కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేసేలా సిబ్బందిని షిఫ్ట్‌ల వారీగా నియమించారు.
సెప్టెంబరు 23, ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు:
ఎం. రియాజ్, జూనియర్ అసిస్టెంట్ – 7893429231
సెప్టెంబరు 23, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు:
బి.హెచ్. మనోజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ – 8688689815
సెప్టెంబరు 23 రాత్రి 8.00 నుంచి సెప్టెంబరు 24 ఉదయం 8.00 గంటల వరకు:
కె.వి.వి. విగ్నేష్, జూనియర్ అసిస్టెంట్ – 9912122004
డీ.వి.ఎస్. నాగమల్లేశ్వరరావు, ఆఫీస్ సబార్డినేట్ – 9985566127
సెప్టెంబరు 24, ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు:
పి. హెప్సీ ప్రహర్షిత, జూనియర్ అసిస్టెంట్ – 8309581562
సెప్టెంబరు 24, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు:
పి. శివరామ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ – 9951575316
సెప్టెంబరు 24 రాత్రి 8.00 నుంచి సెప్టెంబరు 25 ఉదయం 8.00 గంటల వరకు:
ఎం. లోకేష్, జూనియర్ అసిస్టెంట్ – 7036047257
ఎం. దుర్గామస్తాన్, ఆఫీస్ సబార్డినేట్ – 9441535677
సెప్టెంబరు 25, ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు:
పి. జరీనా బేగం, జూనియర్ అసిస్టెంట్ – 9966059279
సెప్టెంబరు 25, మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు:
బి.హెచ్. మనోజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ – 8688689815.
ప్రజల నుంచి వచ్చే సమాచారంపై తక్షణ స్పందన
కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌లో ప్రజలు తెలియజేసే భారీ వర్షాల పరిస్థితి, సమస్యలు, ఫిర్యాదులను సిబ్బంది నమోదు చేసి, కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జి అయిన కార్యాలయ సూపరింటెండెంట్, కోఆర్డినేషన్ విభాగానికి తెలియజేసి తదుపరి చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ఫిర్యాదు/సమాచారం వచ్చిన సమయం, వివరాలను నమోదు చేసి, తమ డ్యూటీ ముగిసే సమయంలో తదుపరి షిఫ్ట్ సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తే కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జికి ముందుగా సమాచారం అందించి ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం నుంచి వచ్చే సూచనలను పాటించాలని జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ డి.కె. బాలాజీ, ఐ.ఏ.ఎస్. సూచించారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి
కృష్ణ జిల్లా, మచిలీపట్నం
వారిచే జారీ చేయబడినది.