ప్రజలందరు సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి.
కర్నూలు కె ఎం సి ప్రజలందరు సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి.
సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె, నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు. కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్.యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, కర్నూలు జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని బ్యాంకులకు కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ తెలిపారు.
అదేవిధంగా సెప్టెంబర్ 26 నాల్గవ శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో, సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు సాధారణ బ్యాంకు శాఖల కార్యకలా పాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నం దున, ప్రజలకు అవసర మైన ముఖ్యమైన బ్యాంకిం గ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకులు తగిన SLBC మార్గదర్శకాలు Business Continuity Plan (BCP) అమలు చేయాలని సూచించారు.
*బ్యాంకులకు ముందస్తు ఏర్పాట్లపై సూచనలు: పి. మోహన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులు కింది చర్యలను ముందుగానే చేపట్టాలని తెలిపారు:*
• NTR భరోసా పింఛన్లు: అన్ని బ్యాంకులు సెప్టెంబర్ నెల పింఛన్ల చెల్లింపులకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖలు/పెన్షన్ పంపిణీ అధికారులతో సమన్వయం చేసుకొని ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి.