BREAKING
డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీ కెనడా పర్యటన: ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తున్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు మతాలు వేరైనా మనుషులు ఒక్కటే ఆధ్యాత్మిక, శాస్త్రీయ అద్భుతాల నిలయం.. చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకతలు రూపాయికి చాక్లెట్‌ కూడా రాదు.. విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చారు: జగన్‌ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైట్‌హౌస్ ఎదుట మూడో రోజూ నిలిచిన జర్నలిస్టులు: టెంట్లు మూసివేత, పాస్‌ల జప్తుపై సీఎన్‌ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ నిరసన అల్లు అర్జున్ రాకా మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఐకాన్ స్టార్! ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం గోవిందను పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. సునీతా అహుజా సంచలన వ్యాఖ్యలు! విశాఖ మేయర్‌, కార్పొరేషన్‌ను హైజాక్‌ చేసిన తీరును ప్రజలకు చెప్పాలి: జగన్‌ బద్వేలు..ప్రహల్లాద రెడ్డి వ్యాఖ్యలు తగవు.. ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి.. సెప్టెంబర్‌ 27న సాధారణ కార్యకలాపాలు జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో గ్రేట్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటుడు అమిత్ తివారీ!

ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం

Select Suryaa Now
ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం

సీఎస్‌తో ఉద్యోగ జేఏసీ నేతల చర్చలు సఫలం.. వచ్చే కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

సీఎస్‌తో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌లో ఉన్న డీఏలపై ప్రధానంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రెండు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

వచ్చే కేబినెట్‌లో ఆమోదం?

రెండు డీఏలకు సంబంధించిన ప్రతిపాదనలను వచ్చే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కేబినెట్‌ ఆమోదం అనంతరం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకరించడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.