BREAKING
తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైట్‌హౌస్ ఎదుట మూడో రోజూ నిలిచిన జర్నలిస్టులు: టెంట్లు మూసివేత, పాస్‌ల జప్తుపై సీఎన్‌ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ నిరసన అల్లు అర్జున్ రాకా మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఐకాన్ స్టార్! ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం గోవిందను పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. సునీతా అహుజా సంచలన వ్యాఖ్యలు! విశాఖ మేయర్‌, కార్పొరేషన్‌ను హైజాక్‌ చేసిన తీరును ప్రజలకు చెప్పాలి: జగన్‌ బద్వేలు..ప్రహల్లాద రెడ్డి వ్యాఖ్యలు తగవు.. ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి.. సెప్టెంబర్‌ 27న సాధారణ కార్యకలాపాలు జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో గ్రేట్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటుడు అమిత్ తివారీ! తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగుండం: నేడు, రేపు ఏపీ, తెలంగాణలకు రెడ్ అలర్ట్, కోనసీమలో జోరువాన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విచేందుకు వస్తున్న ‘అనుమాన పక్షి’.. వైభవంగా ప్రీ-రిలీజ్ వేడుక! పల్లెపండుగకు పకడ్బందీ ఏర్పాట్లు గ్రాండ్‌గా ప్రారంభమైన ‘పెద్దగట్టు జాతర’ సినిమా.. క్లాప్ కొట్టిన ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి! ఇంటికే మీ సేవలు.. హైదరాబాద్‌లో మీ సేవ డోర్‌ డెలివరీ ప్రారంభం

విశాఖ మేయర్‌, కార్పొరేషన్‌ను హైజాక్‌ చేసిన తీరును ప్రజలకు చెప్పాలి: జగన్‌

Select Suryaa Now
విశాఖ మేయర్‌, కార్పొరేషన్‌ను హైజాక్‌ చేసిన తీరును ప్రజలకు చెప్పాలి: జగన్‌

*తాగునీటి సమస్య, భూముల వ్యవహారాలపై ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం

తాడేపల్లి: గ్రేటర్‌ విశాఖపట్నం పరిధిలో పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. విశాఖలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటాలను విస్తృతం చేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా విశాఖ మేయర్‌, మహా నగర పాలక సంస్థను హైజాక్‌ చేసిన తీరును ప్రజలకు వివరించాలని జగన్‌ పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. విశాఖలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తాగునీటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విశాఖ నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యను ప్రధాన అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్‌ సూచించారు. నగరంలో నీటి సరఫరాపై ఇప్పటికే రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. జగన్‌ కూడా విశాఖలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 

భూముల వ్యవహారంపైనా పోరాటం

విశాఖలోని భూముల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు జగన్‌ సూచించారు. ప్రస్తుతం విశాఖలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, విలువైన భూముల అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. 

గ్రేటర్‌ విశాఖలో పార్టీ పరిస్థితులు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలతో చర్చించిన జగన్‌.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.