తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష
ఆలమూరు మేజర్ న్యూస్;మండల కేంద్రమైన ఆలమూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట గల ధర్నా చౌక్ లో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తాతపూడి ఇస్సాక్ ఆధ్వర్యంలో జోరువానలో స్థానికంగా గల పెద్ద కాలువలో అర్దనగ్న జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్ ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని, మరణించిన వీఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని వారు జల దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆలమూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సెక్రటరీ కె శివరామారావు, ఉపాధ్యక్షుడు భువనగిరి ఏసు, సలహాదారుడు నాగేశ్వరరావు, మండల వీఆర్ఏలు దీక్షలో పాల్గొని నినాదాలు చేశారు.