BREAKING
వెదురూరులో సంకల్ప సేవా అభియాన్. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌పై ఏసీబీ పంజా: భారీగా వెలుగులోకి వచ్చిన ఆస్తులు, తనిఖీల వివరాలు భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరావేద్దాం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌ రెడ్డి డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీ కెనడా పర్యటన: ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తున్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు మతాలు వేరైనా మనుషులు ఒక్కటే ఆధ్యాత్మిక, శాస్త్రీయ అద్భుతాల నిలయం.. చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకతలు రూపాయికి చాక్లెట్‌ కూడా రాదు.. విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చారు: జగన్‌ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైట్‌హౌస్ ఎదుట మూడో రోజూ నిలిచిన జర్నలిస్టులు: టెంట్లు మూసివేత, పాస్‌ల జప్తుపై సీఎన్‌ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ నిరసన అల్లు అర్జున్ రాకా మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఐకాన్ స్టార్! ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం గోవిందను పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. సునీతా అహుజా సంచలన వ్యాఖ్యలు!

మతాలు వేరైనా మనుషులు ఒక్కటే

Select Suryaa Now
మతాలు వేరైనా మనుషులు ఒక్కటే

మతాలు వేరైనా.. మనసులు ఒక్కటే!

హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా పులివెందుల వినాయక చవితి వేడుకలు

గణనాథునికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన బీటెక్ రవి, అజ్జుగుట్టు రఘునాథరెడ్డి

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల: హిందూ–ముస్లిం సోదరుల ఐక్యత, మత సామరస్యం, పరస్పర గౌరవానికి పులివెందులలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు చక్కని నిదర్శనంగా నిలిచాయి. పట్టణంలోని మారుతి హాల్ రోడ్డులో పెనుకొండ తరుణ్ (అలియాస్ R15) చిన్న ఆధ్వర్యంలో ఏకలవ్య అసోసియేషన్ కమిటీ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, వేంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ & హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా ఖాసీం, ఏకలవ్య అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు పెనుకొండ తరుణ్ (అలియాస్ R15) చిన్న, కూటమి నాయకులు, కార్యకర్తలు, హిందూ–ముస్లిం సోదరులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. నాయకులు స్వయంగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ సోదరభావంతో వేడుకల్లో పాల్గొన్నారు.

ఐక్యతకు వేదికగా గణేష్ మండపం

హిందూ–ముస్లిం సోదరులు కలిసి గణేష్ మండపం ఏర్పాటు చేయడం, ప్రత్యేక పూజల్లో పాల్గొనడం, అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించడం పులివెందులలోని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. “మతాలు వేరైనా.. మనసులు ఒక్కటే” అనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి.
కార్యక్రమంలో ఏకలవ్య అసోసియేషన్ కమిటీ సభ్యులు, హిందూ–ముస్లిం సోదరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శోభాయాత్రకు భారీగా తరలిరావాలి

రేపు నిర్వహించనున్న గణేష్ శోభాయాత్రకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఏకలవ్య శిష్యులు పిలుపునిచ్చారు