వెదురూరులో సంకల్ప సేవా అభియాన్.
రక్తదానంతో స్ఫూర్తిదాయకం.
చాపాడు మేజర్ న్యూస్ : మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వెదురూరు లో ఆయుస్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంతో పాటు, ప్రధాన కార్యదర్శి మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపధ్యంలో వైద్య శిబిరంతో పాటు రక్త దాన శిబిరాన్ని నిర్వహించారని వైద్యాధికారి డాక్టర్ పి.ఓబులేసు తెలిపారు. ఈ రక్త దాన శిబిరాన్ని జమ్మలమడుగు డిప్యూటీ డి యం హెచ్ ఓ డాక్టర్ గీతా రెడ్డి, చాపాడు మండల బిజెపి అధ్యక్షుడు లోమడ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో 10 మంది సభ్యులు రక్త దానం చేశారు. వారికి ఆపిల్ పండ్లు, జ్యూస్ బాటిల్స్ అందించారు. వారిని గీతారెడ్డి, బి జె పి నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు నుండి వచ్చిన బ్లడ్ డొనేషన్ క్యాంపు బృందం ఆధ్వర్యంలో రక్త సేకరణ నిర్వహించారు, డాక్టర్ పైలా భాను, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 17 వ తేదీ వరకు జరుగుతుందన్నారు.
యోగ పోషణపై అవగాహన
కార్యక్రమంలో భాగంగా యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించి ప్రత్యేక యోగా సెషన్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది అమరావతి, పార్వతీ.జయలక్ష్మి, రాజమ్మ, భారతీ,చురుకుగా పాల్గొన్నారని, వీరు చిన్నారులకు,గర్భవతులకు , బాలింతలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పోషక సేవలపై అవగాహన కల్పించారనీ డాక్టర్ పి. ఓబులేసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ ఈ ఓ లు, వెంకటేశ్వర్లు, జయ ప్రకాశ్, సూపర్ వైజర్స్ ప్రసాద్, భవానీ, ఎ ఎన్ యం లు,, యం ఎల్ హెచ్ పి లు, ఆశా కార్యకర్తలు, బి జె పి నాయకులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, రక్త దాతలు, వెదురూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజల సహకారంతో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం విజయవంతం చేసినట్లు నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. ఓబులేసు తెలియజేశారు.