BREAKING
స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ నంబర్ల ఆటలు సాగవు! శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి బిగ్‌బాస్ 10: రెండో వారం సంచలనం.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! హౌస్ నుంచి బయటికి వెళ్లేది వీళ్లేనా? గణేశ్ నిమజ్జన వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్: రాత్రంతా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు పోలీసుల భద్రతకు పెద్దపీట: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్ సందర్శనను విరమించుకున్న హీరో నాని తెలంగాణకు ఊరట: నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకి కర్ణాటక అంగీకారం కేరళ చికిత్స ముగించుకుని తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కు చంద్రబాబు ఆత్మీయ పరామర్శ శ్రీకాకుళంలో విషాదం: రైలు రూపంలో ముంచెత్తిన మృత్యువు.. నలుగురు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. కృతజ్ఞతలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అలపర్తి విద్యాసాగర్ స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి వెదురూరులో సంకల్ప సేవా అభియాన్. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌పై ఏసీబీ పంజా: భారీగా వెలుగులోకి వచ్చిన ఆస్తులు, తనిఖీల వివరాలు భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరావేద్దాం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌ రెడ్డి

తెలంగాణకు ఊరట: నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకి కర్ణాటక అంగీకారం

Select Suryaa Now
తెలంగాణకు ఊరట: నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకి కర్ణాటక అంగీకారం

సూర్య తెలంగాణ డెస్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లా రైతాంగానికి కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. జూరాల ప్రాజెక్టుకు విడతలవారీగా 3 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయడానికి అంగీకరించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి చొరవ.. బెంగళూరుకు ప్రత్యేక బృందం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ఎద్దడి, పంటల ప్రస్తుత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు కీలక దశలో ఉన్నాయని, వాటిని కాపాడేందుకు కర్ణాటక నుంచి నీరు అవసరమని నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కర్ణాటక డీకే శివకుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.

సీఎం సూచన మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు హుటాహుటిన బెంగళూరు వెళ్లారు. కర్ణాటక సీఎల్పీ సమావేశం బిజీ గడువు మధ్యే సోమవారం రాత్రి ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులతో చర్చలు జరిపిన తెలంగాణ బృందం.. బుధవారం ఉదయం మరోసారి డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది.

పంటలను కాపాడేందుకు నీటి విడుదల

జూరాల కింద దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, వేలాది రైతు కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలంగాణ ప్రజాప్రతినిధులు డీకే శివకుమార్‌కు వివరించారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీకే శివకుమార్.. విడతలవారీగా 3 టీఎంసీల నీటిని విడుదల చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించి కృష్ణా జలాలను విడుదల చేయడానికి అంగీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు తెలంగాణ ప్రజల తరపున ఆయన ఎక్స్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహానికి, సోదరభాަవానికి గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాలకు ఇన్‌ఫ్లో వస్తుండటంతో పాలమూరు రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.