BREAKING
Title: మార్కెట్లోకి ఎలివేట్ క్యాంపసెస్ ఐపీఓ: పూర్తి వివరాలు, ప్రత్యేకతలు ఇవే! పిసి మరియు పి ఎన్ డి టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. కాజా మొనిద్దీన్ మండల పరిషత్ పాలకవర్గం కి ఘన సన్మానం అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ ట్రంప్ 5 బిలియన్ డాలర్ల గల్ఫ్ పునర్నిర్మాణ ప్రణాళిక: సత్తా చాటనున్న ఐదు భారతీయ ఈపీసీ దిగ్గజాలు స్టీల్, ఐరన్, గ్లాస్ అల్యూమినియం వృత్తిలో ఉన్న వారి జీవనోపాధిని కాపాడండి 2026 ప్రపంచ వృద్ధి అంచనాలను పెంచిన ఓఈసీడీ: ఏఐ బూమ్‌తో ఊరట, కానీ భవిష్యత్తుపై హెచ్చరికలు 2029కి డ్రగ్స్ రహిత తెలంగాణ : సీఎం రేవంత్ అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ వాతావరణం: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒడుదొడుకులే కారణం! స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ నంబర్ల ఆటలు సాగవు! శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి బిగ్‌బాస్ 10: రెండో వారం సంచలనం.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! హౌస్ నుంచి బయటికి వెళ్లేది వీళ్లేనా? గణేశ్ నిమజ్జన వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్: రాత్రంతా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు పోలీసుల భద్రతకు పెద్దపీట: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్ సందర్శనను విరమించుకున్న హీరో నాని తెలంగాణకు ఊరట: నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకి కర్ణాటక అంగీకారం

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి

Select Suryaa Now
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి

*8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తుల దర్శనం.. హుండీ ఆదాయం రూ.28.94 కోట్లు

తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసులు, భద్రతా విభాగాలు, ఇతర శాఖల సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా 8 రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల నుంచి శ్రీవారి హుండీ ద్వారా రూ.28.94 కోట్ల ఆదాయం సమకూరింది.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు విస్తృతంగా అన్నప్రసాదాలను అందించారు. మొత్తం 21.84 లక్షల అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కూడా భారీ డిమాండ్‌ ఏర్పడింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 33 లక్షల లడ్డూలు విక్రయించారు.

భక్తులకు దర్శనం, వసతి, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ, లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. అధికారుల సమన్వయం, సిబ్బంది సేవలు, భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.