Title: మార్కెట్లోకి ఎలివేట్ క్యాంపసెస్ ఐపీఓ: పూర్తి వివరాలు, ప్రత్యేకతలు ఇవే!
సూర్య బిజినెస్ డెస్క్: దేశీయ మార్కెట్లోకి మరో ఆసక్తికరమైన పబ్లిక్ ఇష్యూ వచ్చి చేరింది. సమీకృత ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫారమ్‌గా విశేష గుర్తింపు పొందిన 'ఎలివేట్ క్యాంపసెస్ లిమిటెడ్' (Elevate Campuses) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) నేడు (సెప్టెంబర్ 23) అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థుల వసతి గృహాలు (Student Accommodation), విద్యా సంస్థల మౌలిక వసతుల కల్పన రంగంలో సేవలందిస్తున్న ఈ కంపెనీ, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా మార్కెట్ నుంచి రూ. 2,100 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇష్యూ వివరాలు & ముఖ్యాంశాలు:
ఐపీఓ పరిమాణం: రూ. 2,100 కోట్లు
ఇష్యూ రకం: ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ (Fresh Issue) మాత్రమే. ఇందులో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ (OFS) భాగం లేదు.
అంటే కంపెనీ జారీ చేసే మొత్తం 5,80,11,049 కొత్త షేర్ల ద్వారా వచ్చే పూర్తి నిధులు నేరుగా కంపెనీ అభివృద్ధి కేటాయింపులకే చెందుతాయి. ప్రైస్ బ్యాండ్: ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 343 నుంచి రూ. 362 మధ్య నిర్ణయించారు. షేరు ముఖ విలువ (Face Value) రూ. 1.
తేదీలు: ఈ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 23న ప్రారంభమై, సెప్టెంబర్ 25, 2026తో ముగుస్తుంది.
లాట్ సైజ్ & కనీస పెట్టుబడి వివరాలు:
రిటైల్ మదుపర్లు ఈ ఐపీఓలో పాల్గొనేందుకు వీలుగా ఒక లాట్‌కు 41 షేర్లు కేటాయించారు.
కేటాయింపుల నిష్పత్తి (Reservations):
క్యూఐబీ (QIB) వారికి: 75% వాటా
హెచ్‌ఎన్ఐ (HNI / NII) మదుపర్లకు: 15% వాటా
రిటైల్ మదుపర్లకు: 10% వాటా కేటాయించారు.
కంపెనీ వ్యాపార స్వభావం & పోర్ట్‌ఫోలియో:
2005లో ఏర్పాటైన ఈ సంస్థ 'గుడ్ హాస్ట్ స్పేసెస్' (Good Host Spaces), 'స్కాలర్‌జెడ్' (ScholarZ) వంటి ప్రముఖ బ్రాండ్ల ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (HEIs) క్యాంపస్‌లలో విద్యార్థులకు ఆన్-క్యాంపస్ వసతి సౌకర్యాలను కల్పిస్తోంది.
ఆర్థిక పనితీరు:
కంపెనీ తన ఆర్థిక ఫలితాలలో బలమైన వృద్ధిని కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంతో (FY25) పోలిస్తే, మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (FY26) కంపెనీ మొత్తం ఆదాయం రూ. 603.39 కోట్లకు పెరగగా, నికర లాభం (PAT) ఏకంగా రూ.
నిధుల వినియోగం (IPO Objectives):
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను కంపెనీ ప్రధానంగా..
కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థలు తీసుకున్న కొన్ని రుణాల ముందస్తు చెల్లింపునకు.
ప్రమోటర్ల అనుబంధ సంస్థల నుంచి కే-12 (K-12) విద్యాసంస్థలు, క్యాంపస్‌ల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల కోసం.
సాధారణ కార్పొరేట్ అవసరాల నిమిత్తం ఉపయోగించనుంది.
ముఖ్యమైన తేదీలు:
అలాట్‌మెంట్ ఖరారు: సెప్టెంబర్ 28, 2026
రీఫండ్లు & డీమ్యాట్ ఖాతాలకు షేర్ల జమ: సెప్టెంబర్ 29, 2026
స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ (BSE, NSE): సెప్టెంబర్ 30, 2026
ఈ ఇష్యూకి జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.