BREAKING
ముగతిపేటలో ఎమ్మెల్యే పర్యటన వాయుగుండం, భారీ వ‌ర్షాల ప‌ట్ల యంత్రాంగం.. అప్ర‌మ‌త్తం మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే బీవీ లడ్డు వేలం పాట తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై మోతిలాల్ ఓస్వాల్ 'బై' రేటింగ్.. 23% లాభాలందించే అవకాశం మార్కెట్లోకి ఎలివేట్ క్యాంపసెస్ ఐపీఓ: పూర్తి వివరాలు, ప్రత్యేకతలు ఇవే! పిసి మరియు పి ఎన్ డి టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. కాజా మొనిద్దీన్ మండల పరిషత్ పాలకవర్గం కి ఘన సన్మానం అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ ట్రంప్ 5 బిలియన్ డాలర్ల గల్ఫ్ పునర్నిర్మాణ ప్రణాళిక: సత్తా చాటనున్న ఐదు భారతీయ ఈపీసీ దిగ్గజాలు స్టీల్, ఐరన్, గ్లాస్ అల్యూమినియం వృత్తిలో ఉన్న వారి జీవనోపాధిని కాపాడండి 2026 ప్రపంచ వృద్ధి అంచనాలను పెంచిన ఓఈసీడీ: ఏఐ బూమ్‌తో ఊరట, కానీ భవిష్యత్తుపై హెచ్చరికలు 2029కి డ్రగ్స్ రహిత తెలంగాణ : సీఎం రేవంత్ అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ వాతావరణం: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒడుదొడుకులే కారణం!

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Select Suryaa Now
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

*ఉత్తర, ఈశాన్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు ఐదు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

రేపు సెప్టెంబర్‌ 24న కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

మరోవైపు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 25న కూడా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. 

హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ నగరం, పరిసర ప్రాంతాల్లో సాధారణంగా మేఘావృత వాతావరణం ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు.