BREAKING
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’.. ఓవర్సీస్‌లో రెండో స్థానంలో నిలిచి అరుదైన రికార్డు! మెమరీ గైడ్’ పుస్తకాన్ని ప్రశంసించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గణనాథుని లడ్డూకు రూ.1.88 లక్షల ధర తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందేనా? ముగతిపేటలో ఎమ్మెల్యే పర్యటన వాయుగుండం, భారీ వ‌ర్షాల ప‌ట్ల యంత్రాంగం.. అప్ర‌మ‌త్తం మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే బీవీ లడ్డు వేలం పాట తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై మోతిలాల్ ఓస్వాల్ 'బై' రేటింగ్.. 23% లాభాలందించే అవకాశం మార్కెట్లోకి ఎలివేట్ క్యాంపసెస్ ఐపీఓ: పూర్తి వివరాలు, ప్రత్యేకతలు ఇవే! పిసి మరియు పి ఎన్ డి టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. కాజా మొనిద్దీన్ మండల పరిషత్ పాలకవర్గం కి ఘన సన్మానం

వాయుగుండం, భారీ వ‌ర్షాల ప‌ట్ల యంత్రాంగం.. అప్ర‌మ‌త్తం

Select Suryaa Now
వాయుగుండం, భారీ వ‌ర్షాల ప‌ట్ల యంత్రాంగం.. అప్ర‌మ‌త్తం

 

 

*50 పునరావాస కేంద్రాలు సిద్ధం.. 24/7 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
*కొండ‌వాలు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్

విశాఖపట్నం, సెప్టెంబర్ 23, మేజర న్యూస :   బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని, అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉత్త‌ర ఎమ్మెల్యే విష్ణ‌కుమార్ రాజు, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్, ఆర్డీవోలు, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి బుధ‌వారం ఆయ‌న జిల్లాలోని ప‌లు కొండ‌వాలు ప్రాంతాలు, వాయుగుండం ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. మాధ‌వ‌ధార వాంబే కాల‌నీ, క‌స్తూరిన‌గ‌ర్ లో కొండ‌చ‌రియ‌లు జారిన ప్ర‌దేశాల‌ను ప‌రిశీలించారు. ఇటీవ‌ల కాలంలో వాంబే కాల‌నీలో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ శ్లాబ్ పెచ్చులు ప‌డ‌టంతో గాయ‌ప‌డ‌గా ఆమెను క‌లెక్ట‌ర్, ఎమ్మెల్యే, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ ప‌రామ‌ర్శించి, యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు.

క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించిన‌ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడారు. ప్రస్తుతం వాయుగుండం విశాఖపట్నానికి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉందని, భూభాగాన్ని తాకే సమయం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు విశాఖలో ఐదు కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. జిల్లాలో సుమారు 50 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే ప్రజలను తరలించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకున్నామని వెల్లడించారు. రోడ్లపై చెట్లు పడటం, డ్రైనేజీలు బ్లాక్ కావడం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేలా నగరం, జిల్లాలో ఫీల్డ్ స్థాయి బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని శాఖలతో కలిసి జిల్లా స్థాయిలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, విశాఖ నగరంలో సిటీ ఆపరేషన్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వీటితో పాటు జోన‌ల్ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 20 ఫిర్యాదులు అందగా వాటిని వెంటనే పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు. రేపు సాయంత్రం వరకు భారీ వర్షాల సూచనలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఆయ‌న‌తో పాటు భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇత‌ర అధికారులు ఉన్నారు.