BREAKING
వైర్‌లెస్ సెన్సార్ నెట్‌వర్క్‌ల పై పరిశోధనకు గీతం డాక్టరేట్ డ్రైవర్లకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలి జి. వామనమూర్తి డిమాండ్. ఓటీటీలోకి వచ్చేసిన భయానక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా.. సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతున్న వెంట్సర్‌! బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి.... టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు! ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’.. ఓవర్సీస్‌లో రెండో స్థానంలో నిలిచి అరుదైన రికార్డు! మెమరీ గైడ్’ పుస్తకాన్ని ప్రశంసించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గణనాథుని లడ్డూకు రూ.1.88 లక్షల ధర తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందేనా? ముగతిపేటలో ఎమ్మెల్యే పర్యటన వాయుగుండం, భారీ వ‌ర్షాల ప‌ట్ల యంత్రాంగం.. అప్ర‌మ‌త్తం మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే బీవీ లడ్డు వేలం పాట

మెమరీ గైడ్’ పుస్తకాన్ని ప్రశంసించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

Select Suryaa Now
మెమరీ గైడ్’ పుస్తకాన్ని ప్రశంసించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

“ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైన పుస్తకం” – మెమరీ గైడ్. విద్యార్థులు, ఉద్యోగార్థులు, అన్ని వయసుల వారికి ఉపయోగకరం

ప్రముఖ మెమరీ & సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ నిపుణులు, కాగ్నిటివ్ సైకాలజిస్ట్, లీగల్ కౌన్సిలర్, రచయిత డా. వేణు కుమార్ దైవాల రచించిన ‘మెమరీ గైడ్’ పుస్తకాన్ని పుదుచ్చేరి గౌరవ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాష్‌నాథన్కు మర్యాదపూర్వకంగా అందజేశారు.

ఈ సందర్భంగా పుస్తకంలోని అంశాలను పరిశీలించిన లెఫ్టినెంట్ గవర్నర్, ‘మెమరీ గైడ్’ ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైన పుస్తకమని, విద్యార్థులతో పాటు అన్ని వయసుల వారికి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రశంసించినట్లు తెలిపారు.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మైండ్ పవర్, సమాచారాన్ని వేగంగా గ్రహించడం, గుర్తుంచుకోవడం, సమర్థవంతమైన అభ్యాస పద్ధతులు వంటి అంశాలను ఒకే వేదికపై అందించే విధంగా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగకరమైన మార్గదర్శి ‘మెమరీ గైడ్’ కేవలం జ్ఞాపకశక్తిని పెంపొందించే పుస్తకంగా కాకుండా, ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా ఏకాగ్రత పెంచుకోవాలి, సమాచారాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై ఆచరణాత్మక అవగాహన కల్పించే మార్గదర్శిగా రూపొందించబడిందని డా. వేణు కుమార్ తెలిపారు.

ప్రత్యేకంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వృత్తి నిపుణులు, సీనియర్ సిటిజన్లు మరియు జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ పుస్తకంలోని అంశాలు ఉపయోగపడేలా రూపొందించామని ఆయన వివరించారు.

మెమరీ శిక్షణలో ప్రత్యేక అనుభవం గల డా. వేణు కుమార్ దైవాల గత అనుభవాలను, మెమరీ ట్రైనింగ్ రంగంలో తన పరిశీలనలు మరియు శిక్షణా పద్ధతులను సమన్వయం చేస్తూ ‘మెమరీ గైడ్’ను రూపొందించారు. మెమరీ & సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, కాగ్నిటివ్ కోచింగ్ మరియు మైండ్ పవర్ శిక్షణ రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు ఈ పుస్తకం ఒక విస్తరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

“జ్ఞాపకశక్తి ప్రతి ఒక్కరిలో ఉన్న సహజ సామర్థ్యం. దానిని సరైన పద్ధతుల్లో శిక్షణతో అభివృద్ధి చేసుకోవచ్చు” అనే భావనను కేంద్రంగా చేసుకుని పుస్తకంలోని అంశాలను రూపొందించినట్లు డా. వేణు కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ అందించిన ప్రోత్సాహం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని డా. వేణు కుమార్ పేర్కొన్నారు. పుస్తకంలోని అంశాలను ప్రశంసించి, విద్యార్థులు మరియు అభ్యాసకులకు దాని ఉపయోగకరతను గుర్తించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల నుంచి పోటీ పరీక్షల అభ్యర్థుల వరకు…
ప్రస్తుత పోటీ ప్రపంచంలో జ్ఞానం సంపాదించడం మాత్రమే కాకుండా, సమాచారాన్ని వేగంగా గ్రహించడం, గుర్తుంచుకోవడం, అవసరమైన సమయంలో గుర్తుకు తెచ్చుకోవడం అత్యంత కీలకమని ఆయన అన్నారు.

విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో, యువత పోటీ పరీక్షల్లో, ఉద్యోగులు తమ వృత్తిపరమైన అభివృద్ధిలో, పెద్దలు రోజువారీ జీవితంలో జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ‘మెమరీ గైడ్’ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వీర మద్విరాజ్, దీపక్ కుమార్, విశాల్ నర్సింగ్హోజు, రవి రాజన్ తదితరులు పాల్గొన్నారు.