BREAKING
మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే బీవీ లడ్డు వేలం పాట తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై మోతిలాల్ ఓస్వాల్ 'బై' రేటింగ్.. 23% లాభాలందించే అవకాశం Title: మార్కెట్లోకి ఎలివేట్ క్యాంపసెస్ ఐపీఓ: పూర్తి వివరాలు, ప్రత్యేకతలు ఇవే! పిసి మరియు పి ఎన్ డి టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. కాజా మొనిద్దీన్ మండల పరిషత్ పాలకవర్గం కి ఘన సన్మానం అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ ట్రంప్ 5 బిలియన్ డాలర్ల గల్ఫ్ పునర్నిర్మాణ ప్రణాళిక: సత్తా చాటనున్న ఐదు భారతీయ ఈపీసీ దిగ్గజాలు స్టీల్, ఐరన్, గ్లాస్ అల్యూమినియం వృత్తిలో ఉన్న వారి జీవనోపాధిని కాపాడండి 2026 ప్రపంచ వృద్ధి అంచనాలను పెంచిన ఓఈసీడీ: ఏఐ బూమ్‌తో ఊరట, కానీ భవిష్యత్తుపై హెచ్చరికలు 2029కి డ్రగ్స్ రహిత తెలంగాణ : సీఎం రేవంత్ అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ వాతావరణం: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒడుదొడుకులే కారణం! స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ నంబర్ల ఆటలు సాగవు! శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి

అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ

Select Suryaa Now
అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ

*12 ఎకరాల్లో సుధా–వెంకట్‌ జాస్తి క్యాంపస్‌.. ఏటా 3 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు

అమరావతి: రాజధాని అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ జరిగింది. అబ్బరాజుపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్థ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు.

12 ఎకరాల విస్తీర్ణంలో సుధా–వెంకట్‌ జాస్తి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా ఏడాదికి సుమారు 3 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కంటి వైద్యంతో పాటు కంటి, మెదడు సంబంధిత వైద్య సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోందని అన్నారు. రాజధానిలో ఆధునిక వైద్య సంస్థలు, విద్యా సంస్థలు ఏర్పాటవుతుండటం ద్వారా అమరావతి అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.