BREAKING
Title: మార్కెట్లోకి ఎలివేట్ క్యాంపసెస్ ఐపీఓ: పూర్తి వివరాలు, ప్రత్యేకతలు ఇవే! పిసి మరియు పి ఎన్ డి టి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్. కాజా మొనిద్దీన్ మండల పరిషత్ పాలకవర్గం కి ఘన సన్మానం అమరావతిలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్య సంస్థకు భూమిపూజ ట్రంప్ 5 బిలియన్ డాలర్ల గల్ఫ్ పునర్నిర్మాణ ప్రణాళిక: సత్తా చాటనున్న ఐదు భారతీయ ఈపీసీ దిగ్గజాలు స్టీల్, ఐరన్, గ్లాస్ అల్యూమినియం వృత్తిలో ఉన్న వారి జీవనోపాధిని కాపాడండి 2026 ప్రపంచ వృద్ధి అంచనాలను పెంచిన ఓఈసీడీ: ఏఐ బూమ్‌తో ఊరట, కానీ భవిష్యత్తుపై హెచ్చరికలు 2029కి డ్రగ్స్ రహిత తెలంగాణ : సీఎం రేవంత్ అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ వాతావరణం: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒడుదొడుకులే కారణం! స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ నంబర్ల ఆటలు సాగవు! శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి బిగ్‌బాస్ 10: రెండో వారం సంచలనం.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! హౌస్ నుంచి బయటికి వెళ్లేది వీళ్లేనా? గణేశ్ నిమజ్జన వేళ దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్: రాత్రంతా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు పోలీసుల భద్రతకు పెద్దపీట: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్ సందర్శనను విరమించుకున్న హీరో నాని తెలంగాణకు ఊరట: నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకి కర్ణాటక అంగీకారం

బిగ్‌బాస్ 10: రెండో వారం సంచలనం.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! హౌస్ నుంచి బయటికి వెళ్లేది వీళ్లేనా?

Select Suryaa Now
బిగ్‌బాస్ 10: రెండో వారం సంచలనం.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్! హౌస్ నుంచి బయటికి వెళ్లేది వీళ్లేనా?

 

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వివాదాస్పద రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రంజుగా సాగుతోంది. షో ప్రారంభమై రెండు వారాలు గడవకముందే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వ్యూహాలు, ఆసక్తికర పోటీలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఈ వారం కెప్టెన్సీ కోసం జరిగిన ఫిజికల్ టాస్క్‌లు మరింత వైలెంట్‌గా మారడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉంటే, తాజాగా రెండో వారం ఓటింగ్ ట్రెండ్స్ మరియు ఎలిమినేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

రెండో వారం నామినేషన్‌లో 11 మంది..

మొదటి వారం ఎలిమినేషన్ తర్వాత మేకర్స్ రెండో వారం నామినేషన్ ప్రక్రియను ఎంతో భిన్నంగా డిజైన్ చేశారు. రోప్ టాస్క్ పెట్టి, అందులో గెలిచిన వారికి మాత్రమే సింగిల్ లేదా డబుల్ నామినేషన్ చేసే అవకాశం కల్పించారు. ఓడిపోయిన వారు నేరుగా నామినేషన్లోకి వెళ్లేలా నిబంధన పెట్టారు. ఇలా ఈ ప్రక్రియ ముగిసేసరికి షాలినీ, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రామ్‌ప్రసాద్, ముకేశ్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ సహా మొత్తం 11 మంది నామినేషన్లలో నిలిచారు.

ఓటింగ్ ట్రెండ్స్ ఇలా..

నామినేషన్స్ పూర్తికావడంతో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. అగ్నిపరీక్ష ద్వారా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కామనర్ రోహిత్ దాదాపు 30 శాతానికి పైగా ఓట్లతో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నట్లు సమాచారం. ఇక రెండో స్థానంలో త్రిగుణ్ ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ముకేశ్, దేబ్జానీ, రామ్‌ప్రసాద్, షాలిని కొనసాగుతున్నారు.

అయితే చివరి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. బాటమ్ 5 స్థానాల్లో వరుసగా ఝాన్సీ, సుధీర్ రెడ్డి, సృష్టి, వర్షిణి, కృష్ణుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే కృష్ణుడు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంటుందా?

ఈ వారం హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. మొదటి వారంలో హౌస్‌మేట్స్ ఓట్ల ద్వారా చరణ్, చైత్ర మిడ్-వీక్ ఎలిమినేట్ అయినప్పటికీ, ఆదివారం ఎలిమినేషన్ లేదని ప్రకటించారు. అయితే 'పవర్ ఆఫ్ పీపుల్'లో భాగంగా చరణ్‌ను బిగ్‌బాస్ మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇప్పించారు. ఈ లెక్కన మొదటి వారం ఒక ఎలిమినేషన్ మాత్రమే జరిగినట్లే లెక్క.

అంతేకాకుండా, రాబోయే వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్న నేపథ్యంలో.. ఈ రెండో వారంలో మేకర్స్ డబుల్ ఎలిమినేషన్‌కు ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే కృష్ణుడు బయటికి వెళ్లడం పక్కా అనిపిస్తుండగా.. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే, కృష్ణుడితో పాటు వర్షిణి లేదా సృష్టిలలో ఒకరు హౌస్ వీడే అవకాశం ఉంది. అయితే వర్షిణి కంటెంట్ ఇస్తుండటం, హౌస్‌లో తనదైన హైలైట్స్ సృష్టిస్తుండటంతో ఆమెను ఉంచుకుని, సృష్టి లేదా కృష్ణులను ఎలిమినేట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక క్లారిటీ రావాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే!