BREAKING
పోలీసుల భద్రతకు పెద్దపీట: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్ సందర్శనను విరమించుకున్న హీరో నాని తెలంగాణకు ఊరట: నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకి కర్ణాటక అంగీకారం కేరళ చికిత్స ముగించుకుని తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కు చంద్రబాబు ఆత్మీయ పరామర్శ శ్రీకాకుళంలో విషాదం: రైలు రూపంలో ముంచెత్తిన మృత్యువు.. నలుగురు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. కృతజ్ఞతలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అలపర్తి విద్యాసాగర్ స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి వెదురూరులో సంకల్ప సేవా అభియాన్. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌పై ఏసీబీ పంజా: భారీగా వెలుగులోకి వచ్చిన ఆస్తులు, తనిఖీల వివరాలు భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరావేద్దాం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌ రెడ్డి డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీ కెనడా పర్యటన: ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తున్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు మతాలు వేరైనా మనుషులు ఒక్కటే ఆధ్యాత్మిక, శాస్త్రీయ అద్భుతాల నిలయం.. చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకతలు

పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అలపర్తి విద్యాసాగర్

Select Suryaa Now
పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అలపర్తి విద్యాసాగర్

పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ హామీ

సచివాలయ ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం పెండింగ్‌ నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై విద్యాసాగర్‌ హామీ

పులివెందుల మేజర్ న్యూస్:

ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో సాధ్యమైనంత త్వరగా కృషి చేస్తామని ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవోస్‌ ప్రతినిధులకు ఆయన సానుకూలంగా స్పందించారు.
విజయవాడలోని ఏపీ ఎన్జీవోస్‌ భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌, జనరల్‌ సెక్రటరీ డి.వి.రమణ, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌లను పులివెందుల తాలూకా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తాలూకా ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు గజ్జల జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నోషనల్‌ ఇంక్రిమెంట్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ను కోరారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్‌ ఛానల్‌, జాబ్‌చార్ట్‌ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల తరఫున 100 శాతం గ్రాస్‌ శాలరీ, రెగ్యులరైజేషన్‌ తదితర సమస్యలను కూడా ప్రతినిధులు వివరించారు. ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న విద్యాసాగర్‌ సానుకూలంగా స్పందించి, పెండింగ్‌ అంశాల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున పత్తే గంగయ్య మరియు విశ్రాంతి ఉద్యోగులు పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జల జగన్నాథ రెడ్డి  ఆధ్వర్యంలో కలిసి
రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు