BREAKING
అనంతగిరి ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చెరియలు శశి థరూర్–మధుయాష్కీ గౌడ్ భేటీ ఎఐపిసి విస్తరణకు కార్యాచరణ రూపకల్పన సేవా రంగంలో అగ్రగామిగా నిలుస్తుంది - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ పాకిస్తాన్‌లో ఘోర వైద్య నిర్లక్ష్యం: సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే డజన్ల కొద్దీ చిన్నారులకు హెచ్ఐవీ, న్యాయం కోసం బాధితుల పోరాటం నల్లగొండ: నాగార్జున కాలనీ 48వ కార్పొరేషన్ వార్డులో వైభవంగా గణనాథుని లడ్డు వేలం పాట: ₹76,116 రూపాయలకు దక్కించుకున్న గుండా రాంబాబు రైలు లో దొరికిన లాబ్ టాబ్, నగదు విలువైన పత్రాలను పోలీసులుకు అప్పగింత రబీ పంటల సాగుకు రైతులు సన్నద్దము కావాలి పల్లాను కలిసిన శివ నారాయణ చౌదరి కూలీలపై దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు విలక్షణ నటుడిగా సంచలనాలు సృష్టిస్తున్న రాఘవ్ జుయాల్! జీతాలు పెంచమంటే అక్రమంగా తొలగిస్తారా! వైర్‌లెస్ సెన్సార్ నెట్‌వర్క్‌ల పై పరిశోధనకు గీతం డాక్టరేట్ డ్రైవర్లకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలి జి. వామనమూర్తి డిమాండ్. ఓటీటీలోకి వచ్చేసిన భయానక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా.. సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతున్న వెంట్సర్‌! బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి....

రైలు లో దొరికిన లాబ్ టాబ్, నగదు విలువైన పత్రాలను పోలీసులుకు అప్పగింత

Select Suryaa Now
రైలు లో దొరికిన లాబ్ టాబ్, నగదు విలువైన పత్రాలను పోలీసులుకు అప్పగింత

తూర్పుగోదావరి జిల్లా

రైలు లో దొరికిన ల్యాప్‌టాప్‌, నగదు, విలువైన పత్రాలు పోలీసులకు అప్పగింత

 రైలులో ప్రయాణిస్తుండగా తన పక్క బెర్తులో ప్రయాణికుడు వదిలివెళ్లిన నీలం రంగు బ్యాగును గుర్తించి, అందులోని విలువైన వస్తువులను పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన తీపర్తి చింతామణి.

సెప్టెంబర్ 20వ తేదీన తిరుపతి నుంచి తణుకు వస్తున్న రైలులో తీపర్తి చింతామణి ప్రయాణిస్తుండగా, ఆయన పక్క బెర్తులో ప్రయాణించిన ఓ వ్యక్తి నీలం రంగు బ్యాగును వదిలివెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన చింతామణి బ్యాగును తీసుకుని తన స్వగ్రామమైన తీపర్రు చేరుకున్నారు.అనంతరం గ్రామ పెద్ద ప్రత్తిపాటి ప్రసాద్‌ను సంప్రదించి విషయాన్ని తెలియజేశారు. ఆయన సూచన మేరకు బ్యాగును తీసుకుని పెరవలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించారు.బ్యాగును పరిశీలించిన ఎస్‌ఐ అందులో లభించిన ఆధారాల ఆధారంగా సంబంధిత ఫోన్ నంబర్లకు సమాచారం అందించారు. దీంతో బ్యాగు యజమాని హైదరాబాద్‌కు చెందిన ఎం. కుమారస్వామి పెరవలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.బ్యాగులో ఉన్న లెనోవా ల్యాప్‌టాప్‌, కొంత నగదు, ఏటీఎం కార్డులు, పాన్ కార్డు, బట్టలు, ఒరిజినల్ పత్రాలు తదితర వస్తువులను ఎస్‌ఐ కుమారస్వామికి అందజేశారు.ఈ సందర్భంగా బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించి యజమానికి చేరేలా సహకరించిన తీపర్తి చింతామణి, గ్రామ పెద్ద ప్రత్తిపాటి ప్రసాద్‌లకు ఎస్‌ఐ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఇతరులకు చెందిన వస్తువులు దొరికినప్పుడు వాటిని తమ సొంత వస్తువులుగా భావించకుండా, అసలు యజమానులకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు.