సేవా రంగంలో అగ్రగామిగా నిలుస్తుంది - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
జమ్మలమడుగు మేజర్ న్యూస్ : స్ధానిక గూడెంచెరువు రాజీవ్ నగర్ లో నివసించే చౌడం వెంకటరమణ అనే వృద్ధుడు అనారోగ్యం చేత మరణించగ అంతిమ సంస్కరణలు చేయడానికి బందువులు ఎవరు ముందుకు రాకపోవడంతో స్థానికులు ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ను సంప్రదించగా వారు వెంటనే స్పందించి బధవారం హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, నరేంద్ర, కిరణ్ కుమార్, అశోక్ కుమార్, సతీష్ సుబహన్, మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరారు 82972 53484,9182244150.