సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ల పరిశీలన
*సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ల పరిశీలన*
లింగాల మేజర్ న్యూస్:- లింగాల మండలం పార్నపల్లి సమీపంలో రూ.480 కోట్లతో నిర్మిస్తున్న తాగునీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, రూరల్ సీఐ శాంతిలాల్, ఆర్డీవో చిన్నయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చంద్రశేఖర్, తహసీల్దార్ రామచంద్రుడు తదితర అధికారులు పర్యటించారు.
చత్రపతి రిజర్వాయర్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ను పరిశీలించిన అధికారులు, అనంతరం శ్రీ కోన మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని గుట్టపై మరో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.