శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ హీరోయిన్‌గా మానస వారణాసి.. రేపే ఫస్ట్ బూస్టర్ అప్‌డేట్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జార్జ్ క్రిష్’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్న హీరోయిన్‌పై చిత్ర యూనిట్ తాజాగా అధికారిక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన అందాలభామ మానస వారణాసి కథానాయకిగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మానస వారణాసి, ఈ చిత్రంలో శర్వాకు జోడీగా మరింత ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. సినిమాలోని కీలకమైన అప్‌డేట్‌తో కూడిన ఫస్ట్ బూస్టర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. గతంలో విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఫెస్టివ్ లుక్‌తో పాటు శర్వానంద్, హీరోయిన్ సిల్హౌట్ డిజైన్‌తో ఆకట్టుకోగా, తాజా ప్రకటనతో ఈ చిత్రంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి టెక్నికల్ నిపుణుల అత్యుత్తమ బృందం పనిచేస్తోంది. సినిమాటోగ్రాఫర్‌గా కేవీ గుహన్ వ్యవహరిస్తుండగా, సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా అమర్ రెడ్డి కుడుముల బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో నందు సవిరిగాన, గోపీ మోహన్ భాగమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.