శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డు లో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో శ్రీశైలం వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దోర్నాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు చేపట్టారు.