BREAKING
పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: ఎస్ఐఆర్ వివాదంపై బీజేపీ స్పష్టత గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి సిద్ధార్థ్–తమన్నా ‘ది వాన్’.. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్

స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి  కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి  ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష  ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు క్షేత్రస్థాయి నుంచి సన్నద్ధం కావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ప్రజావేదిక ఫిర్యాదులపై ఆరా....

నెలవారీ సమీక్షలో భాగంగా ప్రజావేదికకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామాల వారీగా సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సరిపెట్టకుండా, పరిష్కారం అయ్యే వరకు అనుసరించాలని సూచించారు.
స్థానిక ఎన్నికల సన్నద్ధత, పార్టీ కార్యకలాపాలు, గ్రామస్థాయి ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.