భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు: ఎంపిడిఓ పరుపాటి వెంకటేశ్వర రెడ్డి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు: ఎంపిడిఓ పరుపాటి వెంకటేశ్వర రెడ్డి
మునుగోడు,మేజర్ న్యూస్:
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎంపిడిఓ పరుపాటి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం బుదవారం మండలంలోని సోలిపురం చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ నకిరికంటి మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువు పరిసరాలను పరిశీలించి నిమజ్జన సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.200 వాల్ట్ ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు.ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ తీగలు, స్తంభాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ సిబ్బందికి సూచించారు. అలాగే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సహకారం అందించిన గ్రామ సర్పంచ్ నకిరికంటి మురళీకృష్ణను పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నకిరికంటి మురళీకృష్ణ,మండల విద్యుత్ అధికారి సమ్మిడి నరేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది దనమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, లైన్‌మెన్ (ఎల్‌ఎం) తదితరులు పాల్గొన్నారు.