BREAKING
ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు రజనీకాంత్ జైలర్ 2 పాటపై డేవిడ్ వార్నర్ సరదా స్పందన.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో! మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాదానికి బాధితులం: ఐరాసలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దీటైన బదులు ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి: భారత నావికుడు మృతి, మరో 19 మంది రక్షణ వారణాసి షూటింగ్‌లో మహేష్ బాబు పార్ట్ కంప్లీట్.. రాజమౌళి మూవీపై లేటెస్ట్ అప్‌డేట్! ఐరాస భద్రతా మండలి సంస్కరణల ప్రక్రియ వైఫల్యంపై జీ4 దేశాల తీవ్ర ఆందోళన: ఇతర అంతర్జాతీయ వేదికలపై పోరాటానికి సిద్ధం శర్వానంద్ రెమ్యునరేషన్ భారీగా పెంపు.. ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట! బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డుల మోత! కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్ నాని కష్టానికి నేనే సాక్ష్యం.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ వేళ భార్య అంజన ఎమోషనల్ పోస్ట్! గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది. పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ రజినీకాంత్ సినిమా కోసం ధనుష్ ‘ఓమ్’ మూవీ వాయిదా.. ఇండస్ట్రీ కోసం హీరో అరుదైన నిర్ణయం! మెగాస్టార్ 48 ఏళ్ల సినీ ప్రయాణం.. ఆ అద్భుతమైన రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్న రామ్ చరణ్!

కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్

Select Suryaa Now
కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్

 

ఘనంగా సత్కరించిన అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మెళ్ల గోవిందరావు

 

 

ఎస్.రాయవరం, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి పీవీ మోహన్ పిలుపునిచ్చారు. ఇటీవల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో 26 జిల్లాల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబందించిన వివరాలను కిసాన్ కాంగ్రెస్ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మెళ్ల గోవిందరావు బుధవారం వెల్లడించారు.

ముఖ్యంగా, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ పీవీ మోహన్ మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలను, రైతులను పార్టీతో అనుసంధానం చేయాలని సూచించారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కనిపించేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆదేశించారన్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని గోవిందరావు చెప్పారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తమ పరిధిలో మండలాలు, నియోజకవర్గాల వారీగా నాయకులను నియమించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారని చెప్పారు.

*పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ను సత్కరించిన గోవిందరావు:*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను అనకాపల్లి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మెళ్ల గోవిందరావు సన్మానించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో 26 జిల్లాల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని గోవిందరావు వివరించారు.