BREAKING
ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు రజనీకాంత్ జైలర్ 2 పాటపై డేవిడ్ వార్నర్ సరదా స్పందన.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో! మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాదానికి బాధితులం: ఐరాసలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దీటైన బదులు ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి: భారత నావికుడు మృతి, మరో 19 మంది రక్షణ వారణాసి షూటింగ్‌లో మహేష్ బాబు పార్ట్ కంప్లీట్.. రాజమౌళి మూవీపై లేటెస్ట్ అప్‌డేట్! ఐరాస భద్రతా మండలి సంస్కరణల ప్రక్రియ వైఫల్యంపై జీ4 దేశాల తీవ్ర ఆందోళన: ఇతర అంతర్జాతీయ వేదికలపై పోరాటానికి సిద్ధం శర్వానంద్ రెమ్యునరేషన్ భారీగా పెంపు.. ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట! బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డుల మోత! కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్ నాని కష్టానికి నేనే సాక్ష్యం.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ వేళ భార్య అంజన ఎమోషనల్ పోస్ట్! గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది. పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ రజినీకాంత్ సినిమా కోసం ధనుష్ ‘ఓమ్’ మూవీ వాయిదా.. ఇండస్ట్రీ కోసం హీరో అరుదైన నిర్ణయం! మెగాస్టార్ 48 ఏళ్ల సినీ ప్రయాణం.. ఆ అద్భుతమైన రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్న రామ్ చరణ్!

గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం

Select Suryaa Now
గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం

 

మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలతో తాడేపల్లిలో భేటీ

పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ

విశాఖపట్నం, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్: గ్రేటర్ విశాఖకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజు జగన్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. గ్రేటర్ విశాఖలో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కో-ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పీఏసీ సభ్యులు గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ నియోజకవర్గాల సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మళ్ల విజయ ప్రసాద్, అన్నంరెడ్డి అదీప్ రాజ్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, బొత్స అనూషతో పాటు ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభ రవిబాబు, పార్టీ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

గ్రేటర్ విశాఖ పరిధిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంపై నేతలు దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.