BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డుల మోత! కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్ నాని కష్టానికి నేనే సాక్ష్యం.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ వేళ భార్య అంజన ఎమోషనల్ పోస్ట్! గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది. పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ రజినీకాంత్ సినిమా కోసం ధనుష్ ‘ఓమ్’ మూవీ వాయిదా.. ఇండస్ట్రీ కోసం హీరో అరుదైన నిర్ణయం! మెగాస్టార్ 48 ఏళ్ల సినీ ప్రయాణం.. ఆ అద్భుతమైన రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్న రామ్ చరణ్! గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు: ఎంపిడిఓ పరుపాటి వెంకటేశ్వర రెడ్డి ఇటలీలో మళ్లీ అణు విద్యుత్ రంగానికి ప్రాణం పోసిన మెలోని ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం ఢిల్లీలో మైనర్ బాలికపై దారుణం వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు దేశ రాజధానిలో మిన్నంటిన నిరసనలు సోమాలియాలో భయానక క్షామం వందలాది మంది నిర్వాసితులు కాగా ఈ ఏడాది చివరి నాటికి తీవ్ర ఆహార సంక్షోభం ఫాక్‌లాండ్స్ వివాదంలో ఐక్యరాజ్యసమితి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జెంటీనా అధ్యక్షుడు హేవియర్ మిలీ టిగ్రే ప్రాంతానికి విమాన సర్వీసులు నిలిపివేసిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 72 సీట్లు మావే-శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్

Select Suryaa Now
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 72 సీట్లు మావే-శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 72 సీట్లు మావే

మంచి చేస్తే ఓట్లు వేస్తారు..

ఎవరి గెలుపుని ప్రజలే నిర్ణయిస్తారు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నందు  బుధవారం నాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 72 సీట్లు మావేనని పేర్కొన్నారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కళ్ళు చెదిరే విజయాన్ని అందిస్తారని తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో  850 కోట్లు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలియజేశారు. అలాగే శక్తి వంచన లేకుండా  నెల్లూరు రూరల్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచర్లలో భారీ పరిశ్రమను తీసుకొని వచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే అభివృద్ధికి చిరునామాగా నెల్లూరు రూరల్ మారుస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రతి డివిజన్లో 1000 నుంచి 2000 ఓట్ల మెజార్టీని ఇవ్వాలని తెలిపారు. అలాగే మేయర్ అభ్యర్థికి లక్ష కోట్లు మెజార్టీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు