BREAKING
ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు రజనీకాంత్ జైలర్ 2 పాటపై డేవిడ్ వార్నర్ సరదా స్పందన.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో! మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాదానికి బాధితులం: ఐరాసలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దీటైన బదులు ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి: భారత నావికుడు మృతి, మరో 19 మంది రక్షణ వారణాసి షూటింగ్‌లో మహేష్ బాబు పార్ట్ కంప్లీట్.. రాజమౌళి మూవీపై లేటెస్ట్ అప్‌డేట్! ఐరాస భద్రతా మండలి సంస్కరణల ప్రక్రియ వైఫల్యంపై జీ4 దేశాల తీవ్ర ఆందోళన: ఇతర అంతర్జాతీయ వేదికలపై పోరాటానికి సిద్ధం శర్వానంద్ రెమ్యునరేషన్ భారీగా పెంపు.. ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట! బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డుల మోత! కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్ నాని కష్టానికి నేనే సాక్ష్యం.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ వేళ భార్య అంజన ఎమోషనల్ పోస్ట్! గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది. పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ రజినీకాంత్ సినిమా కోసం ధనుష్ ‘ఓమ్’ మూవీ వాయిదా.. ఇండస్ట్రీ కోసం హీరో అరుదైన నిర్ణయం! మెగాస్టార్ 48 ఏళ్ల సినీ ప్రయాణం.. ఆ అద్భుతమైన రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్న రామ్ చరణ్!

పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ

Select Suryaa Now
పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ

 

 

  • పే స్కేల్ క్రమబద్ధీకరణ, పెండింగ్ ఇంక్రిమెంట్ల కోసం లంచం డిమాండ్
  • పాడేరు RDO కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

పాడేరు, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం నిర్వహించిన ఆపరేషన్‌లో జిల్లా రెవెన్యూ అధికారి (DRO–FAC) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావు రూ.50,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

పాడేరు కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అమ్ము సూర్య చక్రవర్తికి రెగ్యులర్ పే స్కేల్ క్రమబద్ధీకరణతో పాటు 2024 వరకు పెండింగ్‌లో ఉన్న వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరు కోసం DRO రూ.50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు విశాఖపట్నం రేంజ్ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం సాయంత్రం పాడేరు RDO కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.50,000 స్వీకరిస్తున్న సమయంలో లోకేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

లోకేశ్వరరావు 2005లో ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరి అనంతరం రెవెన్యూ శాఖలోకి వచ్చారు. డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతులు పొందిన ఆయన ప్రస్తుతం DROగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు

ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.