27న చలో యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ, మేజర్ న్యూస్ : తెలంగాణఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ పట్ల హర్షం వ్యక్తం చేస్తు యాదాద్రి భవనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఈనెల 27న జరుగనున్న కృతజ్ఞత సభ వాల్ పోస్టర్లను బుధవారం మిర్యాలగూడలోనీ అమర వీరుల స్థూపం వద్ద ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం నాయకులు,సామాజిక వేత్త డా. జాడి రాజు,మారం శ్రీనివాస్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవడం హర్షణీయమని చెప్పారు.కమిటీ తక్షణం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన వారికి,గాయపడిన వారికి,ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు.కృతజ్ఞత సభకు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు మాలోతు దశరథ్ నాయక్, బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి దుర్గయ్య, ఆర్టిసి జేఏసీ నేతలు ఇక్బాల్,పాండు రంగయ్య, దాసరాజు జయరాజు,కుమ్మరికుంట్ల సుధాకర్,ఎండి. మహమూద్, నక్క నాగరాజు తాడురి సైదులు,ఖమ్మంపాడు సైదులు తదితరులు పాల్గొన్నారు.