BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డుల మోత! కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీ.వీ.మోహన్ నాని కష్టానికి నేనే సాక్ష్యం.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ వేళ భార్య అంజన ఎమోషనల్ పోస్ట్! గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పై వైసిపి ప్రయత్నం ఫలించింది. పాడేరు కలెక్టరేట్‌లో ఏసీబీ మెరుపుదాడి రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్ డిఆర్ఓ ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ రజినీకాంత్ సినిమా కోసం ధనుష్ ‘ఓమ్’ మూవీ వాయిదా.. ఇండస్ట్రీ కోసం హీరో అరుదైన నిర్ణయం! మెగాస్టార్ 48 ఏళ్ల సినీ ప్రయాణం.. ఆ అద్భుతమైన రోజు కోసం ఎదురుచూస్తున్నా అంటున్న రామ్ చరణ్! గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు: ఎంపిడిఓ పరుపాటి వెంకటేశ్వర రెడ్డి ఇటలీలో మళ్లీ అణు విద్యుత్ రంగానికి ప్రాణం పోసిన మెలోని ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం ఢిల్లీలో మైనర్ బాలికపై దారుణం వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు దేశ రాజధానిలో మిన్నంటిన నిరసనలు సోమాలియాలో భయానక క్షామం వందలాది మంది నిర్వాసితులు కాగా ఈ ఏడాది చివరి నాటికి తీవ్ర ఆహార సంక్షోభం ఫాక్‌లాండ్స్ వివాదంలో ఐక్యరాజ్యసమితి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జెంటీనా అధ్యక్షుడు హేవియర్ మిలీ టిగ్రే ప్రాంతానికి విమాన సర్వీసులు నిలిపివేసిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్

*అతి శబ్దంతో డీజేలు.. గుండె ఆరోగ్యానికి ముప్పు:డా. శివప్రసాద్

Select Suryaa Now
*అతి శబ్దంతో డీజేలు.. గుండె ఆరోగ్యానికి ముప్పు:డా. శివప్రసాద్

డిజేలన  అధిక శబ్దంతో నిర్వహించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలంగాణ హోమియోపతిక్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు, సహస్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. చినుకని శివప్రసాద్‌ తెలిపారు.

అధిక శబ్దానికి ఎక్కువసేపు గురికావడం వల్ల శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందన పెరిగి గుండె స్పందన, రక్తపోటులో తాత్కాలిక మార్పులు సంభవించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, గుండె స్పందనలో అసమానతలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

డీజే స్పీకర్లకు దగ్గరగా ఎక్కువసేపు ఉండటం వల్ల వినికిడి శక్తిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలు, ఊరేగింపులను ఆనందంగా నిర్వహించడంతో పాటు శబ్ద పరిమితులను పాటించాలని కోరారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారిని అధిక శబ్దం నుంచి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డా. శివప్రసాద్‌ పేర్కొన్నారు.