నేడు వ్యవసాయ విద్యుత్ సరఫరాకి అంతరాయం: మండల విద్యుత్ అధికారి నరేందర్ రెడ్డి మునుగోడు,మేజర్ న్యూస్:
మునుగోడు మండల పరిధిలోని 132 కేవీ మునుగోడు/గూడపూర్ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో 31.5 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను 50 ఎంవీఏకు అప్‌గ్రేడ్ చేస్తున్న సందర్భంగా బుధవారం వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందనీ మండల విద్యుత్ అధికారి సమ్మిడి నరేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 3-ఫేస్ వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
రైతులు విద్యుత్ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. ఉదయం విద్యుత్ కోతల (ఎల్ఆర్ఎస్) కారణంగా ఏర్పడే అంతరాయానికి పరిహారంగా రాత్రి వేళల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.