104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన
*104 వైద్య సేవల్లో నిర్లక్ష్యం.. ఎగువపల్లి ప్రజల ఆవేదన*
కడప బ్యూరో మేజర్ న్యూస్ :- లింగాల మండలంలోని ఎగువపల్లి గ్రామంలో మంగళవారం 104 వైద్య సేవల్లో సమయపాలన లోపించింది. ఉదయం 9 గంటలకు రావాల్సిన డాక్టర్ ప్రసన్నకుమార్ 10:20 గంటలకు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యుడు 2:30 గంటలకే వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.
దీంతో సాయంత్రం వైద్యం కోసం వచ్చిన వృద్ధులు, పనులకు వెళ్లి తిరిగి వచ్చిన గ్రామస్థులు డాక్టర్ లేకపోవడంతో వెనుదిరిగారు. వైద్యుడి విధులపై గతంలో పలుమార్లు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ పై అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి డాక్టర్ సమయపాలన పాటించేలా చర్యలు చర్యలు చేపట్టాలని
వైద్య సేవలోనిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.