BREAKING
అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి 'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం

రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

Select Suryaa Now
రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు పురపాలక చరిత్రలో నూతన అధ్యాయం!

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధికి కేటాయించిన రూ.40 కోట్ల పనులను ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.40 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో రూ.252 కోట్లతో డ్రైనేజీ, నీటి పైప్‌లైన్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ తదితర పనులను యు ఎఫ్ ఐ డి సి  ద్వారా చేపట్టనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరులో జగనన్న కాలనీ భూసేకరణలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. గత పాలనలో జరిగిన అవినీతిని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, పురపాలక కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కొండవీటి భావన, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.