BREAKING
'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి 'మీసయ మురుక్కు 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. హిప్‌హాప్ ఆది సినిమా ఎలా ఉందంటే? గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నికెల్ గనుల కొనుగోలుకు భారత్‌కు చెందిన 'లోహమ్' కసరత్తు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఫీజుల మోత లిథువేనియాకు అమెరికా బలగాల నూతన నియామకం 4వ సారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. కార్తీక్ ఆర్యన్‌కూ ప్రతిష్టాత్మక అవార్డు!

డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు

Select Suryaa Now
డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు

డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు

ప్రొద్దుటూరు, మేజర్ న్యూస్:  పట్టణంలో వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్న డ్రైనేజీ ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, బంకులపై చర్యలకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. డ్రైన్లలో ఆక్రమణలతో పాటు ప్లాస్టిక్, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతున్నట్లు గుర్తించారు. సిల్ట్, చెత్తను వెంటనే తొలగించాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన డ్రైన్లపై ఉన్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, బంకులను గుర్తించి దశలవారీగా తొలగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో మున్సిపల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. డ్రైన్లలో చెత్త, ప్లాస్టిక్ వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు.