సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి : సర్పంచ్ మమత వెంకటరెడ్డి
సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి
: సర్పంచ్ మమత వెంకటరెడ్డి
రాయికోడ్, ; తమ గ్రామ సమగ్ర అభివృద్ధికి తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తానని రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్రామ సర్పంచ్ మమత వెంకటరెడ్డి తెలిపారు.సోమవారం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో సంగాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగానే గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి సౌకర్యం కోసం కొత్తగా బోరు వేయించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజల రవాణా సౌకర్యార్థం, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రి మార్గదర్శకత్వంలో గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మమత వెంకటరెడ్డి వెల్లడించారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ సలావుద్దీన్,గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.